పెడన: లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

6చూసినవారు
పెడన: లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సోమవారం పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అర్హుడికి ఈ ప్రయోజనం ఆలస్యం లేకుండా చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం పటిష్టంగా అమలు అయ్యేలా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.