పెడన పట్టణంలో రోజు విడిచి రోజు సరఫరా చేయాల్సిన తాగునీరు రెండు రోజులు గడిచినా అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదని, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.