పెడన మండలం కూడూరు గ్రామంలో పంచాయతీ చెరువు తవ్వకం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ నిధులు 3.75 లక్షలు జిల్లా పరిషత్ నిధులు ను చైర్మన్ ఉప్పాల హారికా రాము మంజూరు చేశారు. సర్పంచ్ కాగిత విజయలక్ష్మి శ్రీహరి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. స్వగ్రామంలోని చెరువు తవ్వకం పనులకు నిధులు కేటాయించిన జడ్పీ చైర్పర్సన్ కు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.