పెడన: వివాదాస్పదంగా చెరువుల తవ్వకాలు

3చూసినవారు
చేవేండ్రలో చెరువు పూడిక తీత పనులు వివాదాస్పదంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా, అధికార పార్టీ అండతో మట్టి మాఫియా చెలరేగిపోతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కేవలం 2 అడుగుల లోతు వరకే మట్టి తవ్వేందుకు అనుమతులు ఉండగా, ఏకంగా 10 అడుగుల లోతు వరకు తవ్వుతూ మట్టిని విక్రయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి దోపిడీ యథేచ్చగా సాగుతోందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :