మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, టీడీపీ నాయకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పలుచోట్ల ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబటిని అరెస్టు చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.