విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.