పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొత్త రహదారులు నిర్మించారు. అయితే, అక్రమంగా చెరువులు తవ్వుతూ, భారీ వాహనాలలో మట్టిని తరలించే క్రమంలో మట్టి మాఫియా ఆగడాల వల్ల ఈ రోడ్లు పాడవుతున్నాయని, చిత్తుచిత్తు అవుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి లక్షల రూపాయలు ఖర్చు చేశారు.