శుక్రవారం పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్ (28) అనే యువకుడు తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పెడన ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.