పెడన: మడకలో దొంగతనం.. పోలీసులకు పిర్యాదు

2చూసినవారు
ఆదివారం పెడన మండలం మడకలో గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి గ్రామానికి చెందిన మురాల బాజీకి చెందిన 3 పందెం కోడిపుంజులు, జోగి వెంకన్నకు చెందిన ఒక గొర్రెపోతును దొంగిలించినట్లు పెడన పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, కారులో వచ్చిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్