గుర్రపు డెక్కతో తయారుచేసిన హస్తకళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకు తగ్గట్టుగా వాటిని సరఫరా చేసేందుకు మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ పెడన మండలంలోని చేవేండ్ర, బంటుమిల్లి మండలంలోని మనిమేశ్వర పంచాయతీలోని లేల్లగూడెంలో ఆకస్మికంగా పర్యటించి, తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు.