మైనర్లు అతివేగంగా బైక్‌లు నడుపుతూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మైనర్లు బైక్‌లు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఆదేశించినా, స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొంతమంది యువత మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.