కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి మహర్దశ లభించిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెడన నియోజకవర్గం బంటుమిల్లి నుండి గుడివాడ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు.