గుండెపోటుతో వైసీపీ సీనియర్ నాయకుడు మృతి

2చూసినవారు
గుండెపోటుతో వైసీపీ సీనియర్ నాయకుడు మృతి
బంటుమిల్లి మండలం మల్లపరాజు గూడెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ బాబూరావు (65) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి జోగి రాజీవ్ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదివారం జరిగిన అంతిమయాత్రలో ఉప్పాల రాము పాల్గొని, బాబూరావు పార్టీకి చేసిన సేవలను స్మరించుకున్నారు. పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.