పెడన సంతలో పందెం పుంజుల సందడి

6చూసినవారు
పెడన సంతలో పందెం పుంజుల సందడి
సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో పెడన వారపు సంతలో పందెం పుంజుల కొనుగోళ్లు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామునుంచే పందేలపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో సంతకు చేరుకున్నారు. ఆకర్షణీయ రంగుల్లో ఉన్న పుంజులను చూసి కొనుగోలుదారులు పోటీగా బేరాలు ఆడారు. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో గ్రామాల్లో కోళ్ల చోరీలు పెరగడంతో యజమానులు అప్రమత్తమయ్యారు. తమ కోళ్లు ఎక్కడైనా దొంగిలించి ఇక్కడ అమ్ముతున్నారేమోనన్న అనుమానంతో సంతకు వచ్చి పుంజులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్