రోడ్డు ప్రమాదంలో మహిళలకు గాయాలు

3చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళలకు గాయాలు
మచిలీపట్నం-నూజివీడు జాతీయ రహదారిపై పెడనలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వాహనం అకస్మాత్తుగా రోడ్డు దాటడంతో, అటుగా వస్తున్న స్కూటీ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో కవిపురానికి చెందిన కుమారి తలకు గాయమవగా, రూపకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.