
హంసలదీవి టోల్ వద్ద భక్తుల నిరాశ
హంసలదీవి సాగర తీరంలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశ తప్పలేదు. అటవీ అధికారులు పాలకాయతిప్ప కార కట్ట వద్ద గేట్ ఏర్పటు చేసి పర్యాటకులను రానివట్లేదు. ఉదయం 9గంటలనుంచి గేట్ తెరచి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ గేట్ మూసివేస్తున్నారు. అయితే కార్తీకమాసం సూర్యోదయం వేళ పుణ్యస్నానాలు చేస్తే ముక్తి లభిస్తుందనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.



































