ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు లోకేష్, వంగలపూడి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ‘మోంథా’ తుపాను సృష్టించిన బీభత్సానికి వాటిల్లిన నష్టంపై నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర నష్టం మిగిల్చిన మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వారు కేంద్రమంత్రులకు వివరించారు.