ఈడుపుగల్లు: రైలు కూత - 49 కి. మీ కొత్త రైల్వే లైన్

11చూసినవారు
ఈడుపుగల్లు: రైలు కూత - 49 కి. మీ కొత్త రైల్వే లైన్
తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఈడుపుగల్లు రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకోనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, భూసేకరణ, ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రైల్వే లైన్ తరిగొప్పుల నుంచి చీలి, మంతెన మీదుగా దక్షిణంగా రైవాస్ కాలువ వెంబడి ఈడుపుగల్లు, వణుకూరు వైపు వెళ్లనుంది. రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్