మొంథా తుఫాన్ కారణంగా గురువారం సాయంత్రం కంకిపాడు మండలం పునాదిపాడులో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ పంటలకు రూ. 829 కోట్లు, ఉద్యానవనాలకు రూ. 39 కోట్లు, సెరికల్చర్ కు రూ. 65 కోట్లు, ఆక్వా రంగానికి రూ. 1,270 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 71 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.