కంకిపాడుకు చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి ఆదివారం గుండెపోటుతో మరణించారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్పురి భాషల్లో 370కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితం ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించడంతో, రఘునాథ్ రెడ్డి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.