కంకిపాడు మండలంలోని రైతుసేవా కేంద్రాలలో సోమవారం అర్జీలు అందజేసిన పంచకర్ల రంగారావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూతన ఎరువుల అమ్మకం యాప్ విధానం వల్ల కౌలు, చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఎరువులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.