కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకునూరు గ్రామానికి చేరుకున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పేందుకు ఆయన పెనమలూరు బైపాస్ రోడ్డు మీదుగా పెదనా నియోజకవర్గం గూడూరు చేరుకున్నారు. మంగళవారం భారీగా ఆకునూరు వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కల్లుగీత కార్మికులు వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.