కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద మంగళవారం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాదిగా తరలివచ్చిన జగన్ అభిమానులు, పెరిగిన వాహనాల సంచారం కారణంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, జామ్ కాకుండా చర్యలు చేపట్టారు.