పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు శివాలయాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దర్శించుకున్నారు. రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ అధికారులచే సత్కరించబడ్డారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పోలీసు శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.