పెనమలూరు: ప్రజలకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజ్ఞప్తి

3చూసినవారు
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ప్రాపర్టీ టాక్స్, నీటి పన్నులు వంటి పన్నులను తప్పనిసరిగా చెల్లించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం పెనమలూరులో మాట్లాడుతూ, పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ పథకాన్ని వినియోగించుకుని బకాయిలను చెల్లించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్