గురువారం రాత్రి పెనమలూరులో ఏర్పడిన తీవ్ర ట్రాఫిక్ సమస్యలను గమనించిన వెంటనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఆయన, స్వయంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను సులభతరం చేశారు. ప్రతి సమస్యకు తక్షణమే స్పందించే నాయకత్వానికి ఇది నిదర్శనమని స్థానికులు ప్రశంసించారు.