పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై, ముఖ్యంగా సాగునీటి వసతుల మెరుగుదల, కాలువల గురించి ఇరువురూ సవివరంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిరంతరం కృషి చేస్తున్నారని ఈ భేటీ తెలియజేస్తోంది.