పెనమలూరు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనం నడిపిన 20 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా, 18 మందికి రూ. 2.10 లక్షల జరిమానా విధించారు. ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష పడింది. లైసెన్స్ ఉన్న 12 మందికి రూ. 10 వేలు, లైసెన్స్ లేని 6 మందికి రూ. 15 వేలు చొప్పున జరిమానా విధించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు, జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.