తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం పెనమలూరులో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం రైతులకు అందాల్సిన నష్టపరిహారం తప్పక అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపత్తును ఎదుర్కొనేందుకు ముందుగానే చర్యలు తీసుకోవడం వల్లే నష్టం తీవ్రత తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.