సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో కృష్ణా జిల్లాలోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం రాత్రి పొట్టిపాడు, దావులూరు, మోపిదేవి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.