మంతెనలో వృద్ధురాలు దారుణ హత్య?

81చూసినవారు
కంకిపాడు మండలం మంతెనలో ఆదివారం సాయంత్రం ఓ వృద్ధురాలు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పొలం పనులకు వెళ్లిన వెంకటేశ్వరరావు తిరిగి వచ్చేసరికి, తన భార్య స్వర్ణకుమారి వంటింట్లో రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వృద్ధురాలు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్