ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుచిత మాట్లాడుతూ, క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే సరైన వైద్యం అందించవచ్చని, తద్వారా ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.