ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. రద్దీ నియంత్రణకు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతున్నామని, భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా పోలీస్ సిబ్బంది సహకరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు.