కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని సర్వీస్ రోడ్డులో బుధవారం ఉదయం పరుపులు, పచ్చళ్ళ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షాపు యజమానికి, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. షాపులోని కొన్ని పరుపులను బయటకు తరలించగా, మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.