ఉయ్యురు: వీరమ్మ తల్లి ఊరేగింపులో విపరీతమైన రద్దీ

6చూసినవారు
గురువారం రాత్రి వీరమ్మ తల్లి తిరునాళ్లలో అత్యంత కీలకమైన ఉయ్యాల ఘట్టం వేలాదిమంది భక్తుల నడుమ వైభవంగా జరుగుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది సాయంత్రం 5 గంటలకే అమ్మవారు ఆలయ ప్రవేశం చేసేవారు. అయితే, ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి 10 గంటలైనా ఊరేగింపు కొనసాగుతూనే ఉంది. అమ్మవారిని సాగనంపేందుకు ప్రధాన సెంటర్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఉయ్యాల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్