ఉయ్యూరులోని పెట్రోల్ బంకులలో మంగళవారం ఉదయం 5 గంటల నుండి పెట్రోల్ అందుబాటులో లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలను పెట్రోల్ బంకుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, దీనివల్ల ఉదయాన్నే పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.