మండలంలోని సాయి పురం గ్రామంలో ఇటీవల పూర్తయిన రీ సర్వే కార్యక్రమం అనంతరం, మంగళవారం ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా రైతులందరికీ పాస్ పుస్తకాలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐతో పాటు పలువురు పాల్గొన్నారు.