ప్రొఫెసర్ ఎం. ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి మద్దతు ధరగా నిర్ణయించాలని, దళారీ వ్యవస్థను అరికట్టాలని రైతు సంఘం నాయకులు ఆదివారం ఉయ్యూరులో జరిగిన భారీ బహిరంగ సభలో డిమాండ్ చేశారు. భూయజమాని సంతకం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు కోరారు.