రాష్ట్ర మంత్రి కొలుసు పార్దసారధి బుధవారం రాత్రి వీరమ్మ తల్లిని దర్శించుకుని, ఆమెను కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా కొనియాడారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని, అమ్మవారి దయతో ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. పారుపూడి వంశస్థులు ఈ జాతరను నిర్వహిస్తారని మంత్రి పేర్కొన్నారు.