మద్యం మత్తులో యువకులు బీభత్సం

2చూసినవారు
గంగూరులోని ఒక పెట్రోల్ బంక్‌లో అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బీభత్సం సృష్టించారు. పెదఓగిరాలకు చెందిన ఈ యువకులు, పెట్రోల్ పోయించుకున్న తర్వాత డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దాడి చేశారు. మేనేజర్ వారించినా వినకుండా, బంక్‌లోని అద్దాలను ధ్వంసం చేసి గొడవ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్