మొంథా తుఫాన్ నేపథ్యంలో టి. నరసాపురం మండలం బోర్రంపాలెం గ్రామానికి చెందిన 30 మత్స్యకార కుటుంబాలను పునరావాసంలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్చారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆ కుటుంబాలను పరామర్శించి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారికి వీడియో కాల్ చేసి బాధిత కుటుంబాలతో మాట్లాడించారు. వీడియో కాల్ లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు కేంద్రం తరపున కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.