Feb 10, 2026, 10:02 IST/
కేబుల్ తీగ మెడకు చుట్టుకుని.. హెడ్మాస్టర్ మృతి
Feb 10, 2026, 10:02 IST
AP: బాపట్ల (D), చీరాల (M).. దేవినూతల సమీపంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కేబుల్ తీగ మెడకు చుట్టుకుని హెడ్మాస్టర్ మృతి చెందారు. హెడ్మాస్టర్ శ్రీనివాసరావు (56) బైక్పై స్కూల్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేళాడుతున్న కేబుల్ తీగ ప్రమాదవశాత్తు ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో ఆయన ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు గవినివారిపాలెం జడ్పీ హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు.