Nov 14, 2025, 12:11 IST/
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థి మహమ్మద్ అన్వర్ మృతి
Nov 14, 2025, 12:11 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న ఆయన, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఛాతీ నొప్పిగా ఉందని ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కౌంటింగ్ రోజున జరగడంతో విషాదం నెలకొంది.