
తిరువూరు: సిసి రోడ్లు ప్రారంభించిన ఎంపీ చిన్ని
తిరువూరులోని 17వ వార్డులో రూ. 23 లక్షల వ్యయంతో నిర్మించిన షాదీఖానా సీసీ రోడ్డును శుక్రవారం రాత్రి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, రంజాన్ మాసంలో ఈ రహదారిని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, నాయకులు పాల్గొన్నారు.




































