వీహెచ్‌పీ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం

0చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలనులో ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా విశ్వ హిందు పరిషత్తు (వీహెచ్‌పీ) అధ్యక్షులు నేరెళ్ల యుగంధర్ ను సాయిబాబా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పూలదండ వేసి జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు క్రాంతి కుమార్, కె. సూర్య ప్రకాష్ (బుజ్జి), జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు నాళ్ళచిన్న సత్యంబాబు, కోట నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్