ఏ. కొండూరు మండలానికి చెందిన బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై తిరువూరు సీఐ గిరిబాబు ఆదివారం వివరాలు వెల్లడించారు. సమీప బంధువైన తుళ్లూరు వంశీకృష్ణ మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుణ్ని అరెస్టు చేసినట్లు సీఐ గిరిబాబు పేర్కొన్నారు.