ఏ. కొండూరు మండలంలో శనివారం ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ బంధువులు కావడంతో ఈ ఘటన కుటుంబ సభ్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడు వంశీకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఏ. కొండూరు ఎస్ఐ తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.