ఆరుద్ర వర్ధంతి సాహితీవేత్తకు ఘన నివాళి

0చూసినవారు
ఆరుద్ర వర్ధంతి సాహితీవేత్తకు ఘన నివాళి
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అభ్యుదయ కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర (సదాశివశంకర శాస్త్రి) వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరుద్ర తెలుగు సాహిత్యాన్ని సమగ్రంగా పరిశోధించి 12 సంపుటాలుగా "సమగ్ర ఆంధ్ర సాహిత్యం" అనే బృహత్తర గ్రంథాన్ని అందించారని, తెలుగు చిత్రసీమకు అద్భుతమైన పాటలు రాశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.