
బ్రిడ్జిపై లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం
AP: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని గామన్బ్రిడ్జిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రాజమండ్రి వైపు బైక్పై వెళ్తున్న దుద్దుకూరుకు చెందిన కోటి (36), తాతిపూడి చిన్న సుబ్బారావు (40)లను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. కొవ్వూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




