సిఐటియు ఆధ్వర్యంలో తిరువూరు, రాజుగూడెం PHCల ఆశ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రేపు విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా PHC అధికారులకు వినతి పత్రం అందజేశారు. సిఐటియు మండల కార్యదర్శి వెంకటేశ్వరావు మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా ఆశ వర్కర్ల వేతనాలు పెంచలేదని, తక్షణమే వేతనాలు, గ్రాడ్యుటీ, సెలవులు, అంత్యక్రియల ఖర్చులు, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.